Salman Khan : సెలబ్రిటీలు అనగానే వాళ్ల లగ్జరీ లైఫ్ అందరి కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. కోట్లకు కోట్లు వెచ్చించి ఖరీదైన బ్రాండ్ వాచీలు, కార్లు కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ అత్యంత ఖరీదైన వాచ్ గురించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ అద్భుతమైన వాచ్ ధర తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వడం ఖాయం. సల్మాన్ ఖాన్ వాచ్ విలువ అక్షరాల 20 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 167 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్‌ని ధరించి కనిపించారు. సల్మాన్ ఈ క్లిప్‌ను ప్రముఖ అమెరికన్ జ్యువెలరీ డిజైనర్ జాకబ్ అరబో స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. లగ్జరీ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ వ్యవస్థాపకుడు అరబో, సల్మాన్ ఈ కాస్టైల్ వాచ్ ధరించిన క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సల్మాన్‌ను ప్రశంసిస్తూ జాకబ్ ఈ పోస్ట్ పెట్టాడు. “నా బిలియనీర్ వాచ్ ధరించడానికి నేను ఎవరినీ అనుమతించను. అయితే ఈ విషయంలో సల్మాన్ ఖాన్ మినహాయింపు’’ అని పోస్ట్‌లో రాశారు. ఈ గడియారం దాని గొప్పతనానికి, రికార్డు స్థాయి ధరకు ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన ‘బిలియనీర్’ అనే లగ్జరీ బ్రాండ్ నకు సంబంధించినది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సల్మాన్ అభిమానులు ‘సల్మాన్ ఈ వాచ్ ధరిస్తే, ఈ వాచ్ వెలకట్టలేనిదిగా మారిందని అర్థం చేసుకోండి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
గడియారం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా, గడియారం 700 కంటే ఎక్కువ పచ్చ-కట్ వజ్రాలతో పొదిగించబడింది. ఈ వాచ్ చాలా పరిమిత సంఖ్యలో తయారు చేయబడిందని సమాచారం. ప్రత్యేకమైన డిజైన్, వజ్రాల సంఖ్య కారణంగా ఈ వాచ్ లగ్జరీ వాచీల జాబితాలోకి ప్రవేశించింది. వైరల్ అయిన వీడియోను చూస్తుంటే, సల్మాన్ కూడా ఈ వాచ్ నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. ఈ వాచీని ప్రెజెంట్ చేస్తూ ఫోజు కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి సంబంధించినదిగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ వేడుకలో గెస్ట్ లిస్ట్ లో జాకబ్ కూడా ఉన్నాడు. అయితే సల్మాన్ ఇప్పుడు ఈ వాచ్ కొన్నాడా? లేక ప్రయత్నించారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అతను ఈ వాచ్‌ని కొనుగోలు చేస్తే, ఈ బ్రాండ్ వాచ్‌లను కొనుగోలు చేసిన కొద్ది మంది ప్రముఖుల జాబితాలో చేరిపోతాడు. ప్రపంచంలోని క్రిస్టియానో రొనాల్డో, జే-జెడ్, డేవిడ్ బెక్‌హామ్ వంటి కొద్దిమంది స్టార్‌ల వద్ద మాత్రమే ఈ వాచ్ ఉంది అంటే వాచ్ ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు.