Sai pallavi : సాయి పల్లవి దేవుడితో మాట్లాడుతుందా… వెలుగులోకి సంచలన విషయాలు?

2 Min Read

Sai pallavi : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి. ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావు లేకుండా ఎంతో అద్భుతమైన సినిమా కథలను ఎంపిక చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు. సాయి పల్లవి(Sai pallavi) సినిమా కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ నచ్చకపోతే స్టార్ హీరో అయిన నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేశారు అంటే ఈమె కథల ఎంపిక విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అర్థమవుతుంది.

Also Read : Sai Dharam Tej: నా మామయ్యల విజయమే నాకు సంతోషం.. మెగా మేనల్లుడి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ కి చెల్లెలు పాత్రలో, అది కూడా రీమేక్ సినిమా కావడంతో ఈమె నిర్మొహమాటంగా రీమేక్ సినిమాలలో తాను నటించనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇకపోతే తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తనతో దేవుడు మాట్లాడుతాడు అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏ వేదికపై అయితే నేను రిజెక్ట్ చేయబడినానో అదే వేదికపై ప్రభుదేవా సార్ తో కలిసి రౌడీ బేబీ సాంగ్ కంపోజ్ చేశారు.ఆ సమయంలోనాకు అనిపించింది… దేవుడు మన కోసం కొన్ని ప్లాన్ చేస్తాడు. కోల్పోయిన దాని కంటే ఎక్కువ కలిపి ఇస్తాడు, అన్నారు. ఇక నేను ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ మౌనంగా తనకు తానే ప్రశ్నలు వేసుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతారని తెలిపారు.

మనం చేసే పని విషయంలో సూచనలు ఇస్తాడు. దేవుడు మనలోనే ఉన్నాడని నమ్ముతాను, అన్నారు. ఇక దేవుడి పట్ల గట్టి విశ్వాసం ఉన్నవాళ్లు చాలా మంది ఈ విధంగానే ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. అయితే ఈ విషయాలను బయటకు చెబితే ఎక్కడ ఎగతాళి చేస్తారోనని అందరూ భావిస్తారు కానీ సాయి పల్లవి మాత్రం ఎంతో ధైర్యంగా తనతో దేవుడు మాట్లాడుతారు అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version