Sai Dharam Tej: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా మేనల్లుడు.. వధువు ఎవరంటే?

2 Min Read

Sai Dharam Tej : మెగా కుటుంబం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. ఈయన పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మెగా మేనల్లుడిగా సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో కూడా నిలుస్తున్నారు.

ఇక ఈయన కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈయన పెళ్లి గురించి ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలువబడలేదు. తాజాగా మరోసారి సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Also Read : Sai Dharam Tej: నా మామయ్యల విజయమే నాకు సంతోషం.. మెగా మేనల్లుడి కామెంట్స్ వైరల్!

sai dharam tej marriage updates

సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరగబోతుందని వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ మరెవరో కాదు నటి మెహరీన్‌ ఫిర్జాదా అని సమాచారం. ఈమె ఇదివరకే రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నది. ఆ తర్వాత పలు కారణాలతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నది.

ఇలా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న మెహరీన్ మెగా హీరోతో ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరి వివాహం జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు అయితే గతంలో సాయిధరమ్ తేజ్ నటి రెజీనాతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రెజీనా ఖండిస్తూ సాయి తేజ్ తనకు మంచి స్నేహితుడు అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి మెహరీన్ తో సాయితేజ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయంపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Share This Article
Exit mobile version