Rolls Royce : వచ్చేసింది రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్ లిఫ్ట్.. ధర, ఫీచర్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !

2 Min Read

Rolls Royce : బ్రిటిష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ భారతదేశంలో కల్లినన్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వెర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 కోట్లుగా నిర్ణయించింది. కాగా, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ ధర రూ.12.25 కోట్లు. ఈ అప్ డేటెడ్ ఎస్ యూవీకి కల్లినన్ సిరీస్ 2 గా పేరు పెట్టారు. ఇది ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇది కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్,అప్‌డేటెడ్ టెక్నాలజీని పొందుపరిచారు.

కల్లినన్ సిరీస్ 2 ఫీచర్స్, స్పెసిఫికేషన్‌లు
కల్లినన్ సిరీస్ 2 బంపర్ వరకు విస్తరించి ఉన్న ఎల్-ఆకారంలో ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. కంపెనీ దానిని అప్‌డేట్ చేసింది. కారు గ్రిల్ కొద్దిగా కొత్త డిజైన్ ఇవ్వబడింది. వెనుక బంపర్ కూడా స్టెయిన్‌లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్‌తో కొత్త రూపాన్ని పొందుతుంది. కల్లినన్ వీల్స్ కూడా సరికొత్తగా ఇన్‌స్టాల్ చేశారు. దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, క్యాబిన్ డ్యాష్‌బోర్డ్‌లో పూర్తి వెడల్పు గ్లాస్ ప్యానెల్ ఉంది. డాష్‌లో కొత్త డిస్‌ప్లే ‘క్యాబినెట్’ కూడా ఉంది, దీనిలో అనలాగ్ వాచ్.. దాని క్రింద చిన్న స్పిరిట్ ఉన్నాయి. కల్లినన్ రోల్స్ స్పిరిట్(Rolls Royce) ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తాజా వెర్షన్‌తో వస్తుంది, ఇది కొత్త గ్రాఫిక్స్, డిస్‌ప్లేలను అందిస్తుంది.

Also Read : BMW Cars Discounts: త్వరపడండి.. బీఎండబ్ల్యూ కార్లపై ఏకంగా రూ.7లక్షల డిస్కౌంట్

6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్
కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి మాదిరిగానే 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది స్టాండర్డ్ వేరియంట్‌లో 571hp పవర్, 850Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌లో, 600hp పవర్, 900Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇచ్చారు. ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కల్లినాన్ (రూ. 6.95 కోట్లు) కంటే అప్‌డేట్ చేయబడిన కల్లినన్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.55 కోట్లు ఎక్కువ. కొత్త బ్లాక్ బ్యాడ్జ్ దాని పాత మోడల్ (రూ. 8.20 కోట్లు) కంటే రూ. 4.05 కోట్లు ఎక్కువ.

Share This Article