Rocking Rakesh: రోజా నాకు అమ్మ లాంటి వ్యక్తి.. అడగకుండానే అన్ని ఇచ్చారు

2 Min Read

Rocking Rakesh : బుల్లితెరపై ప్రసారమైన కార్యక్రమాలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షో ఒకటే. దాదాపు 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇక ఈ కార్యక్రమం గురించి కొన్ని విమర్శలు వచ్చినా ఈ కార్యక్రమంలో సందడి చేసిన వాళ్లు మాత్రం కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈషో మొదట్లో కమెడియన్స్ గా పనిచేసిన వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగాను నిర్మాతలుగాను దర్శకులుగా గుర్తింపు పొందారు..

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాకింగ్ రాకేష్(Rocking Rakesh) ఒకరు. రాకేష్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ కూడా ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా రాకింగ్ రాకేష్ నిర్మాతగా హీరోగా కేసీఆర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Also Read : Anasuya: జానీ మాస్టర్ వ్యవహారం …సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!

Rocking rakesh

ఇక త్వరలోనే ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రాకింగ్ రాకేష్ సినీ నటి, జబర్దస్త్ మాజీ జడ్జ్, మాజీ మంత్రి రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాకింగ్ రాకేష్ రోజా మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాలలో వీరు రోజ ఇంటికి వెళ్లి సందడి చేశారు.

ఇక రోజాకు మద్దతుగా గత ఎన్నికలలో రాకేష్ నగరిలో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. నాకు కూతురు పుట్టిందనే విషయం తెలియగానే మొదట వచ్చి నా కూతురును చూసిన వ్యక్తి రోజా గారు. ఆమె నేను కష్టాలలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నాకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. నేను అడగకపోయినా నా సమస్య తెలుసుకొని డబ్బు అందించారు. ఆమె నాకు అమ్మ లాంటి వ్యక్తి. కొంతమంది రోజా నుంచి లబ్ధి పొంది కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అది వాళ్ల వ్యక్తిగతం అని ఇన్ డైరెక్టుగా రోజాను విమర్శించిన వాళ్లకు తన దైన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article