Renu Desai : గుడ్ న్యూస్ చెప్పిన పవన్ మాజీ భార్య రేణుదేశాయ్… ఏడాది తర్వాత అంటూ?

2 Min Read

Renu Desai : సినీనటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసినదే. ఈమె కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇలా పిల్లల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న రేణు దేశాయ్ (Renu Desai)సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇక పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో ఈమె కూడా తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్రకు మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈమె ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. దీంతో మరోసారి రేణు దేశాయ్ వెండితెరకు దూరం అవుతున్నారా అనే సందేహం అందరిలోనూ కలిగింది.

Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!

ఇకపోతే తాజాగా ఈమె తన కొత్త సినిమాని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ఈమె మేకప్ వేసుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఏడాది తర్వాత షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్నాను అంటూ తెలియచేశారు. అయితే ఈమె ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మాత్రం బయట పెట్టలేదు.

ఇలా సినిమా విశేషాలు బయట పెట్టక పోవడంతో ఈమె ఏ సినిమాకు కమిట్ అయ్యారు, అందులో హీరో ఎవరు ఏంటి అనే విషయాలపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు తన పిల్లలకి సంబంధించిన విషయాలు గురించి పోస్టులు చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులతో వాగ్వాదానికి దిగుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

Share This Article
Exit mobile version