Reliance : వారెవ్వా..! అదిరిపోయే న్యూస్ – 65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ సంతకం…

Reliance : ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోనే అతిపెద్ద సంస్ధ రిలయన్స్ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో సంస్ధ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దీంతో త్వరలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి రానున్నాయి.

ఏపీలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 500 అత్యాధునిక బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ (Reliance) ఎనర్జీ ముందుకొచ్చింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఏపీలో 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. 8 జిల్లాల్లో 500 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. రెండేళ్లలో బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున రిలయన్స్ ఎనర్జీకి అన్ని రకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also Read : Y.S Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… పరువు నష్టం దావా వేస్తానంటూ?

Reliance

రాష్ట్రాభివృద్ధికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజని బాబు అన్నారు. రైతులకు రూ.30 వేలు చొప్పున ఇచ్చేలా పాలసీ ఉంటుందని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల ఉద్యోగాలు దీని వల్ల లభిస్తాయన్నారు. ఏపి ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐతే రిల‌య‌న్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని కోరారు. 25 ఏళ్ళల్లో 57వేల 650 కోట్ల బెనిఫిట్ వ‌స్తుందని చంద్రబాబు తెలిపారు. 500ప్లాంట్ లు పూర్తిచేస్తే రిన్యూవ‌బుల్ ప్యూయ‌ల్ 9 ల‌క్ష‌ల 35వేల ఎల్ సి బిల‌కు రిప్లేస్ మెంట్ వ‌స్తుందని వెల్లడించారు.

ఈ సందర్బంగా మంత్రులు లోకేష్‌, గొట్టిపాటి ర‌వి, టిజి భ‌ర‌త్ ల‌ను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా అభినందించారు. అతి స్వ‌ల్ప‌కాలంలో ఈ ఎంవోయూ కోసం లోకేష్ బాగా ప‌ని చేశారన్నారు. లోకేష్ కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చామని, ఆ దిశ‌గా ఆయ‌న ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. మంత్రి గొట్టిపాటి ర‌వి కూడా ఒప్పందం కార్య‌రూపం దాల్చ‌డానికి బాగా స‌హ‌క‌రించారని కొనియాడారు. మంత్రి టిజి భ‌ర‌త్ ఉన్న‌త విద్యావంతుడు, చాలా మంచి వ‌ర్కు చేస్తున్నారని చంద్ర‌బాబు మెచ్చుకున్నారు.

Share This Article
Exit mobile version