Realme P2 Pro 5G : తక్కువ ధరలో 24జీబీ ర్యామ్.. 512జీబీ స్టోరేజీతో సరికొత్త ఫోన్ లాంచ్

2 Min Read

Realme P2 Pro Launch : ఇటీవల కాలంలో చౌక ఫోన్ల వాడకం పెరిగిపోయింది. తక్కువ ఖరీదులో అత్యాధునిక ఫీచర్లు ఉన్న రకరకాల మోడల్స్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. 25,000 రూపాయల బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం రియల్ మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గేమింగ్ కోసం జీటీ మోడ్, Qualcomm Snapdragon ప్రాసెసర్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో రియల్ మీ పీ1 ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్ రియల్ మీ పీ2 ప్రోని కంపెనీ లాంచ్ చేసింది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఈ రియల్ మీ మొబైల్ ఫోన్‌లో సెక్యూరిటీ నిమిత్తం చేర్చబడ్డాయి. ఫోన్ విక్రయాలను సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ అధికారిక సైట్, రియల్ మీ యాప్‌లో అందుబాటులోకి రానుంది. ఇది ఆరోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.

భారతదేశంలో ఈ ఫోన్ ధర ఈ రియల్ మీ మొబైల్ ఫోన్ మూడు వేరియంట్‌లు 8జీబీ/128జీబీ, 12జీబీ/256జీబీ , 12జీబీ/512జీబీలలో లభించనున్నాయి. 8 జీబీ వేరియంట్ ధర రూ.19,999, 256 జీబీ వేరియంట్ ధర రూ.21,999, 512 జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఈ ఫోన్ పారోట్ గ్రీన్, ఈగిల్ గ్రే రెండు కలర్ వేరియంట్‌లలో లాంచ్ చేయబడ్డాయి,

రియల్ మీ ప్రో2 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్ప్లే:
ఈ రియల్ మీ ఫోన్ 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.7 అంగుళాల ఫుల్ హెడీ ప్లస్ కర్వ్డ్ Samsung AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీరు ఈ ఫోన్‌ని 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్,1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో పొందుతారు.


ప్రాసెసర్: స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPUతో పాటు Qualcomm Snapdragon 7S Generation 2 ప్రాసెసర్‌ని ఉపయోగిస్తుంది. 12 జీడీ వర్చువల్ RAM సహాయంతో RAMని 24 GB వరకు పెంచుకోవచ్చు.


కెమెరా సెటప్: 50-మెగాపిక్సెల్ LYT-600 ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్‌తో పాటు ఫోన్ వెనుక భాగంలో అందించబడింది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది.


బ్యాటరీ కెపాసిటీ: 5200 mAh శక్తివంతమైన బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో అందించబడింది.
కనెక్టివిటీ: 5G సపోర్ట్ ఉన్న ఈ ఫోన్‌లో Wi-Fi 6, 4G LTE, USB టైప్-C పోర్ట్, GPS వంటి ఫీచర్లు ఉంటాయి.
సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ Android 14 ఆధారంగా Realme UI 5.0 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.

Share This Article
Exit mobile version