Ramcharan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన చరణ్ ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీ విడుదల కానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ పరోక్షంగా తెలియజేశారు కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ విగ్రహాలను దుబాయ్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
Also Read : Samantha: అతన్ని ఇప్పటికీ చాలా మిస్ అవుతున్నా.. సమంత పోస్ట్ వైరల్… నాగచైతన్య గురించేనా?
RamCharan and Rhyme Receive Rare Honor
ఇక త్వరలోనే రామ్ చరణ్ (Ramcharan ) మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకలలో భాగంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయడం గురించి పలు విషయాలను వెల్లడించారు. రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే రామ్ చరణ్ అలాగే రైమ్ కొలతలను కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వీరి మైనపు విగ్రహాలను సింగపూర్ బ్రాంచ్ కి చెందిన మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా రామ్ చరణ్ రైమ్ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో మేడం టుస్సాడ్స్ యాజమాన్యానికి రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్ తో పాటు రైమ్ కి కూడా అరుదైన గౌరవం లభించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.