Ram Charan: ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో రామ్ చరణ్… ఎందుకో తెలుసా?

2 Min Read

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల అవుతున్న తరుణంలో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ (Ram Charan)బుచ్చిబాబు డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. అనంతరం సుకుమార్ డైరెక్షన్లో కూడా ఈయన పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరో గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చరణ్ కు కార్లు అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.

Also Read : Ramcharan: రామ్ చరణ్ తో పాటు రైమ్ కి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషంలో అభిమానులు!

Ram charan

ఇప్పటికే తన గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన వివిధ రకాల బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా తన గ్యారేజ్ కు మరో కొత్త కారు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన రోల్స్ రాయిస్ బ్రాండ్ కు చెందిన కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఎన్నో అత్యాధునిక వసతులతో సరికొత్త కొత్త ఫీచర్స్‌తో ఉన్న ఈ కారును చరణ్ భారీ ధరకు కొనుగోలు చేశారు. దాని హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర సుమారుగా 7.5 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఎలక్ట్రికల్ ఫీచర్స్‌తో ఉండే ఫాంథామ్ కారును తొలిసారి మార్కెట్‌లోకి వచ్చింది.

గత జూలై నెలలోనే రోల్స్ రాయిస్ కొన్న చరణ్ దానిని ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో తాత్కాలికంగా రిజిస్టర్ చేశారు. అయితే తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు పూర్తి కావడంతో ఈయన పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఆర్టీవో ఆఫీస్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చరణ్ ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Article