Rakul Preet Singh: సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే చాలా కష్టతరమైన విషయం అని చెప్పాలి. అవకాశాలు రావడం గగనం అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరింత కష్టమని చెప్పాలి. అవకాశాలు అందుకున్న తర్వాత సినిమా కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ సినిమాలు చేస్తేనే హీరోలకు లేదా హీరోయిన్లకు లైఫ్ ఉంటుంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్స్ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని పలు సందర్భాలలో తెలిపారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఒకవైపు నేపోటిజం మరోవైపు కొత్త వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో నేపోటిజం ఉన్న నేపథ్యంలో స్టార్ సెలబ్రిటీల పిల్లలకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయని తద్వారా కొత్త వాళ్లు టాలెంట్ ఉన్న ఇండస్ట్రీకి దూరమవుతున్నారనే వాదన కొనసాగుతుంది. అయితే మరి కొంతమంది మాత్రం టాలెంట్ ఉంటేనే ఎంత స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇండస్ట్రీలో కొనసాగుతారు లేదంటే ఇండస్ట్రీకి దూరమవుతారని వాదిస్తున్నారు. ఇప్పటికే ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినవారు సక్సెస్ అందుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేపోటిజం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈమె సౌత్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కెరియర్ మొదట్లో కేవలం నేపోటిజం కారణంగా నేను ఎన్నో అవకాశాలను కోల్పోయానని తెలిపారు.
ఈ విధంగా అవకాశాలు రాలేదని, చాలా అవకాశాలు మిస్ అయ్యాయని,కానీ, ఏ రోజు బాధపడలేదని రకుల్ చెప్పుకొచ్చింది. తన నాన్న దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ఏదైనా సరే సొంతంగా ఎదగడానికే ప్రయత్నిస్తానని,అవకాశాలు కోల్పోవడం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ కిడ్ కు వచ్చిననన్నీ ఆఫర్లు మిగతా వారికి రావడం లేదని, అందంతా తమ పేరెంట్స్ కష్టము అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి