Ntr : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఈయనని పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమాల ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి అక్కడ కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే అది నటుడు రాజీవ్ కనకాల అని చెప్పాలి.
Also Read : Ntr -Kalyan Ram: ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య దూరం పెంచిన దేవర.. అసలేం జరుగుతోంది?
Why Does November Give NTR Chills? The Story Behind His Fear
వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు అంటే దర్శక నిర్మాతలు కూడా ఆ సినిమాలో రాజీవ్ కనకాల కోసం ఓ పాత్ర సిద్ధం చేసే వాళ్ళు అంటే వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంతలా ఉందో స్పష్టం అవుతుంది. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ గురించి రాజీవ్ కనకాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజీవ్ కనకాలను యాంకర్ ప్రశ్నిస్తూ మీకెందుకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం అని అడగగా రాజీవ్ కనకాల ఎమోషనల్ అవుతూ ఎన్టీఆర్ చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎలాంటి కల్మషం ఉండదని తెలిపారు.
ఎన్టీఆర్ గురించి రాజీవ్ కనకాల ఇలా చెబుతున్న నేపథ్యంలో వెంటనే ఎన్టీఆర్ మాట్లాడుతూ నవంబర్ నెల వస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈయన నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ ఇప్పటికి మెసేజ్ చేస్తారని, నాకు కొడుకులు పుట్టిన రాజీవ్ నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ మెసేజ్ పంపుతారు అంటూ తారక్ అసలు విషయం వెల్లడించారు.ఇక రాజీవ్ మొబైల్ లో నా ఫోన్ నెంబర్ కిడ్ అని సేవ్ అయ్యి ఉంటుందంటూ ఎన్టీఆర్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.