Rajamouli: ప్రభాస్ కెరియర్లో బెస్ట్ షాట్ అదే… రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2 Min Read

Rajamouli : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి క్రేజ్ ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్న ఈయన అద్భుతమైన విజయాలను అందుకొని అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు పొందారు.

ఇక రాజమౌళి(Rajamouli) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇటీవల వచ్చిన RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి(Rajamouli) సినిమా అంటేనే ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో ఈయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాకు పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Also Read: Siddharth : సిద్దార్థ్ తన పెళ్లిలో పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇక రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు.అలాంటి రాజమౌళికి ఒక స్పెషల్ సీన్ ఉంది అంటే దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ నటించిన సినిమాలో ఒక సీన్ ఈయనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు.. ఇక ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ అంటే మనం బాహుబలి సినిమాలో సీన్ అనుకుంటే పొరపాటు పడినట్టే.

రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చత్రపతి. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఒక షాట్ లో ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించారని స్వయంగా రాజమౌళి తెలిపారు. ఒకే షాట్ లో రెండు మూడు ఎమోషన్స్ ని మిక్స్ చేస్తే ఆ షాట్ చేయడం సులువు కాదని..జక్కన్న చెప్పుకొచ్చాడు. చత్రపతి సినిమాలో హీరో ఉండే కాలనీలో చిన్నపిల్లాడు కల్లులేని తల్లికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో హీరోకి వాళ్ళ తల్లి గుర్తుకొస్తుంది. ఒకవైపు తల్లిని తలుచుకుని ఆనందం, మరోవైపు ఆ పిల్లాడిని అదృష్టం తనకు లేదని బాధ.. ఆ షాట్ లో ప్రభాస్ అద్భుతంగా నటించాడని, ఆ షాట్ ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.

Share This Article