ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం తలుపులు మూసుకోనున్నాయి. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు.21, 22, 23 శని, ఆది, సోమవారాల్లో జగన్నాథ ఆలయాన్ని మధ్యాహ్నం వరకు మూసివేస్తారు. సెప్టెంబర్ 18న పూరీ జగన్నాథ ఆలయ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్‌ఐకి లేఖ రాసింది.
సెప్టెంబర్ 24లోగా ఆలయ రత్న భంఢార్ సర్వే పూర్తి చేయాలని కోరింది. ఎందుకంటే సెప్టెంబర్ మాసం కార్తీక మాసం కాబట్టి. అంతకు ముందు జగన్నాథుని ఆరాధన ఉండనుంది. కావున ఆ గడువులోగా సర్వే పూర్తి చేయాలని కోరారు.దీంతో శనివారం నుంచి మూడు రోజుల పాటు పూరీ జగన్నాథ ఆలయాన్ని మూసివేయనున్నారు.
శనివారం నుంచి జగన్నాథ ఆలయంలోని రత్న భంఢార్ ఏఎస్‌ఐ సర్వే చేయనుంది. దీంతో పూరీలోని జగన్నాథ ఆలయాన్ని పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) మూడు రోజుల పాటు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూసివేయబడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జగన్నాథ ఆలయంలోని రత్న భంఢాగారాన్ని ఏఎస్‌ఐ సర్వే నిర్వహించనున్నారు.
ఈ మూడు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని నియంత్రిస్తామని అధికారులు తెలిపారు. ఆలయ ద్వారాలు అన్నీ మూసేస్తామని అధికారులు తెలిపారు.పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండారం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతికత ఆధారంగా రత్న భండార్ గుట్టును తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడనుంది. అదేవిధంగా రత్న భండారంలోనే రహస్య గదులను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.