Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం అయిన ఈమె ఈ సినిమా ద్వారా మొదటి సక్సెస్ అందుకొని అనంతరం తెలుగులో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. సమంత తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె నాగచైతన్య ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా కొనసాగిన వీరి జీవితం అనంతరం మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోవాల్సి వచ్చింది. ఇక సమంత విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక సమంత నటించిన సినిమాలలో అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లిన ఈమెకు ఈ సినిమాకు సంబంధించి ఒక ఫోటోని చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ దేవుడు లాగా ఆశీర్వదిస్తూ ఉండగా సమంత కింద భక్తురాలు లాగా నమస్కరిస్తూ ఉంది. ఈ ఫోటోని చూడగానే సమంత ఒక్కసారిగా నవ్వుతూ ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీ బయట పెట్టారు.
పవన్ కళ్యాణ్ గారు కనుక యాక్టర్ కాకపోయి ఉంటే ఆయన నాకు గురువు అయ్యేవారు అంటూ పవన్ కళ్యాణ్ ని తన గురువుగా భావించి ఈమె కామెంట్ చేశారు. నిజానికి ఈ ఫోటో స్విజర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలోదని తెలిపారు. స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ చైర్స్ లేకపోతే నేను కింద కూర్చుని ఉన్నాను అప్పుడే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి నిలబడ్డారు.
నేను ఒకసారిగా ఆయన వంక చూసి నమస్కరిస్తూ ఉండగా ఆయన కూడా దేవుడిలాగా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నట్టు ఫోజు ఇచ్చారంటూ ఈ ఫోటో వెనుక ఉన్న స్టోరీని ఈమె బయట పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సమంత ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఇక పవన్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా మారగా సమంత కూడా హీరోయిన్ గా నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.