Prakash Raj :తిరుమల తిరుపతి లడ్డూ వివాదం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష వేళ ప్రకాశ్ రాజ్ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఎక్స్‌లో సంచలన కామెంట్స్ చేశారు. “కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి” అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రకాశ్ రాజ్ ఇండైరెక్టుగా కామెంట్స్ చేశారు. కాగా, లడ్డూ వివాదంపై ప్రకాశ్ రోజుకో ట్వీట్ చేస్తున్నారు.
ఇలా ఎన్నో రకాలుగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చాక, ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.ఈ మధ్య కాలంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. లడ్డూ వ్యవహరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.
గత జగన్ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుని కలిపారని ఆరోణలు రావటంతో హిందువులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను వెంటనే డిస్మిస్ చెయ్యండి… తెరపైకి కొత్త డిమాండ్?
Prakash Raj’s Sensational Comments: Was His “New Devotee”
ఇక లడ్డూ వివాదంపై వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకి, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో యూజ్ చేసిన నెయ్యిలో ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుని సీఎం చంద్రబాబు రిలీజ్ చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లడ్డూ వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదు? అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. మైసూరు లేదా ఘజియాబాద్ ల్యాబ్ ల నుండి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు నాయుడు సర్కార్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో లడ్డూ వివాదంలో చంద్రబాబే తొందరపడి వ్యాఖ్యలు చేసినట్టు అయిందని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చినట్టు అయింది.
దీంతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే #CBNShouldApologizeToHindus అనే ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.