హీరో ప్రభాస్ పెట్టే భోజనం… వణికిపోయిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

2 Min Read

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి మాత్రమే మాట్లాడతారు. ప్రభాస్ మంచి ఫుడీ అనే సంగతి తెలిసినదే.

ఈయన భోజనం చేయాలి అంటే తన డైనింగ్ టేబుల్ పై అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండాల్సిందే. ఇక ప్రభాస్ ఇంట్లో ఏమైతే తింటారో ఇంట్లో పనివారికి ఆ ఇంటికి వచ్చే అతిధులకు కూడా అదే భోజనం పెడతారు. ఎవరైనా తన ఇంటికి వెళ్తే కడుపునిండా తిని బయటకు రావాల్సిందే. ఇకపోతే ప్రభాస్ సినిమా షూటింగ్లో కనుక ఉంటే షూటింగ్ లొకేషన్లో ఉన్న వారందరికీ కూడా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తూ ఉంటారు.

ఇలా వారికి నచ్చిన ఆహార పదార్థాలు అన్నింటిని కూడా స్వయంగా ప్రభాస్ ఇంటి నుంచి తయారుచేసి పంపిస్తారు. ఈ విధంగా ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గొప్పగా చెప్పారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాట్లాడుతూ అమ్మో అంటూ భయపడిపోయారు.. ఎన్టీఆర్ ను కృష్ణంరాజు ప్రభాస్ తమ ఆతిథ్యంతో చాలా భయపెట్టారని ఈయన తెలిపారు.

కృష్ణంరాజు ప్రభాస్ బిల్లా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం మలేషియాలోనే ఎక్కువగా జరిగింది. ఇక మలేషియాలో సినిమా యూనిట్ అందరికీ కూడా ప్రభాస్ స్వయంగా భోజనాలు తయారు చేయించి పెట్టించే వారట. ఓ రోజు సినిమాకు సంబంధించిన సెలెబ్రేషన్ జరుగుతుండగా సుమారు 40 రకాల నాన్ వెజ్, వెజ్ అలాగే ఇండియన్ ఫారెన్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా తయారు చేయించారు.

ఇకపోతే ఎన్టీఆర్ కూడా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం మలేషియాలో ఉండడంతో ప్రభాస్ ను కలవడానికి వెళ్లారట ఎలాగో లంచ్ టైం అయింది కదా భోజనం చేయి అని చెప్పి కృష్ణంరాజు, ప్రభాస్ తనని ఒక గదిలోకి తీసుకెళ్లారట. ఆయన వెళ్లిన ఐదు నిమిషాలకి ఆ నలభైరకాల ఆహార పదార్థాలు చుట్టూ పెట్టారని ఎన్టీఆర్ తెలిపారు.

ఇలా వాటిని చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా భయపడిపోయి ఏంటి ఇప్పుడు ఇవన్నీ నేను తినాలా అంటూ షాక్ అయ్యారట. అంతేకాకుండా ఎరక్కపోయి ఇరుక్కున్నాను.. ఇక్కడ కూడా ఇన్ని ఐటమ్స్ ఆ.. భోజనంతో చంపేసేలా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా అంటూ నవ్వేశారట. అప్పటినుంచి ప్రభాస్ పంపించే ఫుడ్ అంటే ఎన్టీఆర్ అమ్మో అంటూ భయపడిపోతారని తెలుస్తోంది.

TAGGED:
Share This Article
Exit mobile version