Samantha : అలాంటి వారు ఎప్పుడు అదృష్టవంతులే… వైరల్ అవుతున్న సమంత కామెంట్స్!

2 Min Read

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. సమంత నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అన్ని భాషలలో సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లడం తిరిగి మయోసైటిసిస్ వ్యాధికి గురి కావడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Also Read : Samantha: అతన్ని ఇప్పటికీ చాలా మిస్ అవుతున్నా.. సమంత పోస్ట్ వైరల్… నాగచైతన్య గురించేనా?

Samantha

ఇలా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్న సమంత ఎంతో ధైర్యంతో తన ఇబ్బందులతో పోరాటం చేసి నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలోనే సమంత తాజాగా చేసిన కామెంట్స్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాయని చెప్పాలి. మనుషులకు కష్టాలు వచ్చినప్పుడే మరింత బలంగా మారుతారు. నా జీవితంలో నేను అట్టడుగు స్థాయికి వెళ్ళినప్పుడు తన సామర్థ్యం ఏంటో తెలిసింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏది సమస్య అనిపించదు.. కష్టం అనిపించదు. నిజంగానే అలాంటి స్థితిలో ఉండి కష్టపడుతున్న వారు చాలా అదృష్టవంతులు.

నేడు నేను ఇంత బలంగా ఉన్నాను అంటే అందుకు కారణం గతంలో నేను ఎదుర్కొన్న కష్టాలే అంటూ సమంత తెలిపారు. తన వద్ద ఎవరైనా కష్టాలు పడుతున్నాను అని చెబితే కనుక మంచిదే కదా అంటూ చెప్పేదానిని అంటూ సమంత ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ది ఫ్యామిలీ మెన్ 2వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్ లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సమంతకు జోడిగా నటించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో సమంత యాక్షన్ సన్నివేషాలతో అదరగొట్టిందని చెప్పాలి.

Share This Article
Exit mobile version