Pawan Kalyan : అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకొకసారి ఓజీ అంటే అంటూ?

2 Min Read

Pawan Kalyan : సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించినది చాలా తక్కువే అయినప్పటికీ ఈయనకి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. నటుడిగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఎంతో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయాలలో కూడా ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు.

ఇలా రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు పవన్ కళ్యాణ్ ని మరోసారి తెరపై చూడాలని ఆరాటపడుతున్నారు. అయితే ఎన్నికల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు సగం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నాయి. ఆయనకు వీలైనప్పుడు ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!

pawan kalyan

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఏదైనా బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా అభిమానులు పెద్ద ఎత్తున తన సినిమాల అప్డేట్స్ కావాలి అంటూ గోల చేస్తున్నారు. గతంలో కూడా అభిమానులు సినిమా అప్డేట్స్ అడగడంతో ప్రస్తుతం తనకు బాధ్యతలే ముఖ్యమని తరువాత వినోదమని పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా అభిమానులకు సమాధానం చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ దీపం 2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తరుణంలో అభిమానులు ఆయన నటిస్తున్న ఓజీ సినిమా అప్డేట్ కావాలి అంటూ పెద్ద ఎత్తున గోల చేశారు. ఓజీ.. ఓ జీ అని సినిమా గురించి కాకుండా ఒక భగవంతుడు గురించి స్మరిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో సినిమా ఉండాలి అది కూడా సరదాకు మాత్రమే. సినిమా బాగుండాలన్న కడుపులు నిండాలన్న మన కడుపు నిండాలి కదా డబ్బులు రావాలి కదా అంటూ తనదైన శైలిలో అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన సరదాగా అన్నా, కోపంతో అన్న తాను చెప్పిన మాటలలో పూర్తిగా నిజం ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Share This Article