Pawan Kalyan Daughter : ఏపీలోని తిరుపతి లడ్డు వ్యవహారం ఇంకా చల్లబడలేదని చెప్పాలి. తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో తప్పు జరిగినందుకు ప్రాయశ్చిత్తం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి కావడంతో ఈయన స్వయంగా మెట్ల మార్గంకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమణ చేశారు.
నిన్న సాయంత్రం మెట్ల మార్గం కుండా పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఇలా కొండపైకి వెళ్లిన ఈయన నేడు స్వామి వారిని దర్శనం చేసుకొని దీక్ష విరమణ చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు తన ఇద్దరు కుమార్తెలు కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కుమార్తె ఆద్యతో పాటు తన మూడవ భార్య అన్నా కుమార్తె పలీనా అంజలితో కలిసి ఈయన స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను వెంటనే డిస్మిస్ చెయ్యండి… తెరపైకి కొత్త డిమాండ్?
Pawan Kalyan Daughter Polena Makes Declaration at Tirumala
పలీనా క్రిస్టియన్ కావడంతో ఆమె స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు డిక్లరేషన్ కి సంబంధించిన ఫామ్ తీసుకురావడంతో ఆమె ఈ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పలీనా మైనర్ కావడంతో తన తండ్రి అయిన పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు.
ఇక ఇప్పటివరకు అన్నా పవన్ కళ్యాణ్(Pawan Kalyan Daughter) పిల్లలను చాలావరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచారు. అయితే మొదటిసారి ఈమె పవన్ కళ్యాణ్ పక్కన కనిపించడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పవన్ చిన్న కుమార్తెను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు చిన్న కుమారుడు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక తన రెండవ కుమారుడికి సంబంధించిన ఫోటోలు ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలేదు. దీంతో పవన్ మరో కుమారుడు ఎలా ఉన్నారనే ఆత్రుత అభిమానులలో కలుగుతుంది.