Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. ఇలా తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే వారాహి బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. లడ్డు కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. అయితే ఈ లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో మాట్లాడుతూ లడ్డు కల్తీ విషయంలో మేము జగన్ ని తప్పు పట్టడం లేదంటూ మాట మార్చారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!
Pawan Kalyan Clarifies: “We Never Said Tirupati Laddu Was Impure”
తాజాగా వారాహి సభలో కూడా లడ్డు వ్యవహారం గురించి ఈయన మాట్లాడుతూ మేము జగన్మోహన్ రెడ్డి గతంలో లడ్డూలు చుట్టారని, ఆయన కల్తీ చేశారని ఎక్కడ చెప్పలేదు. మేము ఆరోపణలు చేసింది కేవలం జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్స్ పైనే అని తెలిపారు. టీటీడీ హయామంలో లడ్డు తయారీ విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని మా ఆవేదన అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తిరుపతి లడ్డు విషయంలో గుమ్మడికాయ దొంగ అంటే ఈయన భుజాలు తడుముకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక లడ్డు తయారీ విషయంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా కోర్ట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్ట్ తీర్పు పై స్పందించిన సంగతి తెలిసిందే.