NTR: చంద్రబాబును కలవనున్న ఎన్టీఆర్… ఆ భయంతోనే మామయ్య దగ్గరకు వెళ్తున్నారా?

2 Min Read

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గత కొద్ది రోజులుగా నందమూరి కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. తన తండ్రి హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ పెద్ద దిక్కును కోల్పోయారు. అంతేకాకుండా తన బాబాయ్ బాలయ్యతో కూడా రిలేషన్స్ మంచిగా లేవనే తెలుస్తుంది. దీంతో బాలయ్య కూడా ఎన్టీఆర్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.

ఇక ఎన్టీఆర్ 2009వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి కూడా దూరమయ్యారు. ఆ సమయంలో ఈయన ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో తనని కొంతమంది ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. దీంతో ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా వచ్చి సినిమాల పైన ఫోకస్ పెట్టారు. ఇక 2019వ సంవత్సరంలో టిడిపి పార్టీ ఘోరంగా పరాజయం అయింది. ఆ సమయంలో వైసీపీ నాయకులు తన మేనత్త భువనేశ్వరిని అవమానకరంగా మాట్లాడిన సమయంలో ఏదో స్పందించాలి అంటే స్పందించారు తప్ప ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఇలా ప్రతి విషయంలోనూ నందమూరి నారా కుటుంబాలకు ఎన్టీఆర్ దూరంగా వచ్చారు అయితే ఉన్నఫలంగా ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఇలా ఏపీ ముఖ్యమంత్రిని కలవబోతున్నారనే విషయం తెలియడంతో చాలామంది దేవర సినిమా విషయంలోనే ముఖ్యమంత్రిని కలవబోతున్నారంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయిన తర్వాత సినిమాపై అంచనాలు కాస్త తగ్గాయి. దీంతో సినిమా పని నిమిత్తమే చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారని అందరూ భావిస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత తన మామయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఏపీకి వరదలు సంభవించిన సమయంలో ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణకు 50 లక్షలు ఏపీకి 50 లక్షలు ప్రకటించారు. దీంతో 50 లక్షలు అందించడం కోసమే ఈయన చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Share This Article