Devara : దేవరలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్.. మూడో వాడిని అందుకే దాచేశారట ?

2 Min Read

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “దేవర”. ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన దేవర ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దేవర ట్రైలర్‌కి యూట్యూబ్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. దేవర ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని నందమూరి అభిమానులు భావించారు, కానీ అది అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందని వినికిడి. అంతేకాదు ట్రైలర్‌లో ఆచార్య ఛాయలు, ఆంధ్రావాలా కథాంశం అక్కడక్కడా కనిపిస్తుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే దర్శకుడు కొరటాల శివ అసలు కథ మొత్తాన్ని రెండో భాగంలోనే ఉంచి ఈ పార్ట్‌లోని పాత్రలను, వాటి స్వభావాలను ఫస్ట్ పార్టులో పరిచయం చేస్తారని తెలుస్తోంది.

అయితే దేవర ట్రైలర్ విడుదలైన తర్వాత, దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రేక్షకులకు తెలియని మూడో పాత్ర ఉందంటూ కొరటాల చిన్న హింట్ ఇచ్చాడనే వ్యాఖ్యలు వస్తున్నాయి. మీరు దేవర ట్రైలర్‌లో చూస్తే, సముద్రంలో పడవలపై పోరాటంలో, గుర్తు తెలియని వ్యక్తి రెండు కత్తులతో పూర్తిగా ముసుగు వేసుకుని నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వెనుక పడవలు కాలిపోతుండగా మంటల్లో భయానక దృశ్యం కనిపించింది. అయితే ఆ సీన్‌లో దేవరనే ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఈ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటుందని సమాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో పాత్ర అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే సినిమాలో దేవర, వర పాత్రలు కాకుండా మరో పాత్ర ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ లెక్కన దేవరలో రెండు పాత్రలు అన్నదమ్ములు కాగా, మరో కనిపించని మరో పాత్ర తండ్రి పాత్ర. అయితే బహుశా అది వేరే స్టార్ హీరోల ప్రత్యేక పాత్ర కావచ్చు అనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఆ పాత్ర ఉంటే మాత్రం దేవర సెకండ్ పార్ట్ లోనే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. దేవర విడుదలకు రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున, ఇది సెప్టెంబర్ 27 న పాన్-ఇండియన్ భాషలలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Share This Article
Exit mobile version