Ntr -Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ బడ్జెట్ లెక్కలు

2 Min Read

Ntr -Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో నటించిన దేవర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ 31 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పనులు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 350 కోట రూపాయల వరకు ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమా కంటే ఈ సినిమా దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అధికమని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటేనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ పై ప్రశాంత్ నీల్ వర్క్ చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. సోలో హీరోగా తారక్ సినీ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావటం విశేషం.

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రష్మికతో పాటు ఇతర హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కి మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

Share This Article
Exit mobile version