Devara సినిమా చూసేవరకు నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని ఎమోషనల్ కామెంట్స్!

2 Min Read

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. అలాగే ఎన్టీఆర్ సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు సమయం చాల తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాట్లు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెలు పిండేసే స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. తిరుపతికి చెందిన కౌశిక్‌ (19) కొంత కాలం నుంచి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల కౌశిక్ తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ నేను ఎక్కువ కాలం బతకను నాకోసం మీరు బాధపడకండి.

నన్ను ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా విడుదల అయ్యే వరకు బ్రతికించండని వేడుకున్నట్లు తన తల్లిదండ్రులు మీడియా ముందు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నా బిడ్డ ఎన్టీఆర్ కి వీరాభిమాని అందుకే తన సినిమా చూసే వరకు బ్రతికించమని వేడుకుంటున్నారు. దయచేసి ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డ చివరి కోరికను తీర్చండి అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులను కలిసి వేస్తుంది.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఎన్టీఆర్ సైతం చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా ఈ సినిమా ఉందని చెప్పడంతో ఈ సినిమా పట్ల అభిమానులు మరింత ఆత్రుత కనపరుస్తున్నారు.

Share This Article
Exit mobile version