NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇరవై సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందించారు. తన అభిమానులకు మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా కోసం ప్రాణం పెడతాడన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అతి చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా షూటింగ్ పూర్తయింది. ఎన్నో అంచనాల నడుమ దేవర సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకుర్చారు.
ఇటీవల విడుదలైన దేవర ట్రైలర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… క్లైమాక్స్ సీన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయని.. చివరి 40 నిమిషాల సినిమా మామూలుగా ఉండదని దేవరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే.. ట్రైలర్ ఈవెంట్లో ఎన్టీఆర్ ధరించిన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. డ్రస్ ధరపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ ఖరీదు రూ. 50,000, స్వెటర్ ఖరీదు 46,400, ఎన్టీఆర్ ధరించిన షూ ఖరీదు 90,000, వాచ్ ధర కోటి వరకు ఉంటుందని సమాచారం. చివరగా ఎన్టీఆర్ లుక్ చాలా క్లాసిక్ గా ఉందని అభిమానులు అంటున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మాణ బృందం సెన్సార్‌కి పంపగా… సినిమా మొత్తం పది షాట్లను కట్ చేయాలని సెన్సార్ సభ్యులు చెప్పారు. దర్శకుడు, ఎడిటర్ ఈ సన్నివేశాలను తొలగించిన తర్వాత దేవర సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని, జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ తన నటనతో మెప్పించాడని దర్శకుడు చెప్పడంతో సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హృతిక్ రోషన్ అతిథిగా రానున్నారు. ప్రస్తుతం హృతిక్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఆ స్నేహం కారణంగానే హృతిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ కూడా వస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తే కానీ అసలు విషయం మాత్రం తెలియడం లేదు.