Ntr balenciaga shoes: ఎన్టీఆర్ ధరించిన ఈ షూస్ ఖరీదు ఎంతో తెలుసా…

2 Min Read

Ntr balenciaga shoes : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై ఓ రేంజ్ లోఅంచనాలను పెంచాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం ఎన్టీఆర్ తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో ఈయనకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఎన్టీఆర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలో భాగంగా ఎన్టీఆర్ ధరించిన షూస్ అందరిని ఆకర్షించాయి. దీంతో ఈయన ధరించిన ఈ షూ ఏ బ్రాండ్ కు చెందినది, దీని ఖరీదు ఎంత అనే విషయాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన ఈ షూస్ balenciaga అనే కంపెనీకి చెందినవని తెలుస్తోంది. ఆన్ లైన్ లో ఈ షూస్ ధర 995 డాలర్లుగా ఉంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 80 వేల రూపాయల విలువ చేస్తాయని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ ఇలా ఎంతో ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన ధరించే వాచ్ లు కూడా కోట్ల విలువ చేస్తుంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే సినిమా సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమాకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

Also Read : Devara: దేవర సినిమాకు మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ కదా… ఆ హీరో ఎవరో తెలుసా?

కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అనంతరం ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎన్టీఆర్ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

TAGGED:
Share This Article
Exit mobile version