NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ గతంలో పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి NTR పలు వ్యక్తిగతమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అయితే ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి. ముఖ్యంగా ఈయన ప్రేమ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Also Read : NTR: ఆ క్షణం ఎంతో భయపడిపోయాను… సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్!
NTR and Sameera Reddy relation
ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డితో ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి నరసింహుడు అశోక్ వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగిందనే వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయం గురించి ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా పలు విషయాలను వెల్లడించారు.
ఏదో ఒక సమయంలో, ఎవరో ఒకరి మీద ప్రేమ కలుగుతుంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యాను. కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యాను, అని ఎన్టీఆర్ అన్నారు. మళ్లీ ఆ ప్రేమ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అనే ప్రశ్న ఎదురవగా.. ఒక్కసారి నేను ఏదైనా డేసిషన్ తీసుకుంటే మరోసారి దాని గురించి ఆలోచించనని కూడా సమాధానం చెప్పారు.
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా నాలాగే మా అమ్మని చూసుకోవాలి. మరి నా అంత కాకపోయినా నాలో సగం ప్రేమను పంచుతూ అయినా అమ్మని చూసుకోవాలి. లక్ష్మీ ప్రణతిని చూడగానే నాకు బాగా నమ్మకం వచ్చింది. అందుకే పెళ్లి చేసుకున్నాను అంటూ ఈయన తెలిపారు. ఇలా అమ్మ కోసమే ఈయన ప్రేమించిన అమ్మాయిని కాదని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.
ఇక లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే.