Ntr: ఆ విషయంలో ప్రణతి నాకు రోజు గొడవే.. చాలా కాంప్రమైజ్ అవుతుంది

2 Min Read

Ntr: సాధారణంగా భార్యాభర్తలు అంటే వారి మధ్య చిన్నచిన్న గొడవలు ఉండటం సర్వసాధారణం. గొడవలు పడటం ఆ తర్వాత కాంప్రమైజ్ కావడం అనేది జరుగుతుంది. అదే ఒక స్టార్ సెలబ్రిటీ కపుల్స్ మధ్య గొడవ జరుగుతుంది అంటే చాలామంది ఆ గొడవ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ తన భార్యతో రోజు గొడవ పడుతుంటారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వయసులో లక్ష్మీ ప్రణతి దాదాపు తొమ్మిది సంవత్సరాలు చిన్నది అయినప్పటికీ వీరిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంటకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారని చెప్పాలి. ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరు సంతానం. ఇక లక్ష్మీ ప్రణతి కేవలం ఇంటి పట్టునే ఉంటూ తన కుటుంబ వ్యవహారాలను పిల్లల వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉంటారు. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు.

Also Read :Devara : దేవర సినిమాని చుట్టుముడుతున్న బ్యాడ్ సెంటిమెంట్స్… సెంటిమెంట్లను బ్రేక్ చేసేనా?

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తన భార్యతో గొడవ పడే విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ ఏసీ టెంపరేచర్ విషయంలో నాకు ప్రణతికి మధ్య ప్రతిరోజు గొడవ జరుగుతుందని తెలిపారు. అయితే ప్రణతి ప్రతిరోజు కాంప్రమైజ్ అవుతుంది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన భార్యతో తనకు జరిగే గొడవ గురించి ఈ సందర్భంగా తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

ఇక ఇదే ప్రశ్న ఈ సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ను కూడా ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఈ విషయంలో నేను కరీనా కపూర్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని సమాధానం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అతి త్వరలోనే బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోల భార్యలు వివిధ రకాల బిజినెస్ లను నిర్వహిస్తూ ఉన్నారు. మరి లక్ష్మీ ప్రణతి ఎలాంటి బిజినెస్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

TAGGED:
Share This Article
Exit mobile version