ఎన్టీఆర్ వారసులు: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు హీరోయిన్లు తప్పనిసరిగా వారి పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తారు అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు వారసత్వంగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఎన్టీఆర్ వారసులగా తన ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇండస్ట్రీలోకి వస్తారని అభిమానులు భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తన కొడుకుల సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్లారు. అక్కడ ఈయనకు తన ఇద్దరి కొడుకుల సినీ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
Also Read : Ratan Tata Success : అసలు రతన్ టాటా ఎవరు? వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారు
NTR Reacts to His Kids Potentially Becoming Heroes
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ…
వాళ్లిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. సినిమాల్లోకి అడుగుపెట్టు.. యాక్టింగ్‌లోనే రాణించాలి అని వాళ్లను బలవంతం చేయను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను అలా ట్రీట్ చేయలేదు.ఏదో సాధించాలనుకుంటున్నాడు చేయని అని అనుకున్నారు. అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేనూ గౌరవించాలనుకుంటున్నా. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు.. ఆ బాటలోనే అడుగులు వేయాలని కొడుకులు కూడా కోరుకుంటారు. అది సహజంగా జరుగుతుంది కదా అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.