రాజమౌళి డైరెక్షన్లో పవన్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా?

2 Min Read

సాధారణంగా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ సినిమా కూడా నిర్మాతలకు నష్టాలను తీసుకురాలేదు. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన డైరెక్షన్లో ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ రవితేజ నితిన్ వంటి పలువురు హీరోలు సినిమా చేసే సక్సెస్ అందుకున్నారు.

ఇక ఇప్పటికి కూడా ఎంతోమంది స్టార్ హీరోలు ఈయనతో సినిమాలు చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒక స్టార్ హీరోకి ఈయన డైరెక్షన్లో సినిమా చేసే చాన్స్ వచ్చినప్పటికీ కూడా మిస్ చేసుకున్నారని తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాల్సి ఉండగా మిస్సయింది. పవన్ కళ్యాణ్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారు అయితే ఆ సినిమా చేయటానికి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఆసక్తి చూపించలేదట ఆసక్తి చూపించకపోవడంతో ఆ సినిమా మరొక హీరో చేతికి వెళ్లడం ఆయన హిట్ అందుకోవడం జరిగింది.

SS Rajamouli

మరి పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించారు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 19 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.

ఇలా ద్విపాత్రభినయంలో నటించిన రవితేజ ఒక పాత్రలో దొంగగా మరొక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పవన్ కళ్యాణ్ ఈ సినిమా మిస్ చేసుకోవడం రవితేజ హిట్ అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు కలవలేదని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

TAGGED:
Share This Article
Exit mobile version