Nithya Menon: పెళ్లయిన హీరో కాపురంలో చిచ్చుపెట్టిన నిత్యమీనన్.. విడాకుల వరకు వెళ్లిందా?

2 Min Read

Nithya Menon: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిత్యమీనన్ ఒకరు. నిజానికి జర్నలిజంపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి ఈమె అటువైపుగా కొనసాగుతున్న సమయంలో నందిని రెడ్డి కంట్లో పడింది. నందిని రెడ్డి అనుకున్న అలా మొదలైంది సినిమాకు పర్ఫెక్ట్ గా సరిపోతుందన్న ఉద్దేశంతో ఆమెకు ఇష్టం లేకపోయినా ఈ సినిమాలో హీరోయిన్గా నిత్యమీనన్ ను పరిచయం చేశారు అలా మొదటి సినిమాతోనే హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిత్యమీనన్ అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు.

ఇలా ఈమె వరస సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. నిత్యా మీనన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా వరించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే గతంలో నిత్యా మీనన్ కి సంబంధించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.

ఇక ఈమె పెళ్లయిన హీరోలతో రిలేషన్ లో ఉందని ఈమె కారణంగా ఓ హీరో ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వినిపించాయి. మరి నిత్యమీనన్ కారణంగా భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్న హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా. ఈయన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.

ఇలా నిత్యమీనన్ సుదీప్ ప్రేమలో పడ్డారని వీరిద్దరూ ప్రేమలో ఉన్న నేపథ్యంలో సుదీప్ తన భార్యతో గొడవలు పడటమే కాకుండా ఆమెకు విడాకులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ తాజాగా మరోసారి ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఇలా నిత్యమీనన్ ప్రేమలో ఉన్నటువంటి సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని భావించారట కానీ తన కుమార్తె కారణంగా ఈయన విడాకులు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవడమే కాకుండా నిత్యమీనన్ కి దూరం అవుతూ తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

Share This Article