Niharika Konidela: వదిన ఇంట్లో ఉంటే చేసే పని అదే.. లావణ్య గుట్టు రట్టు చేసిన నిహారిక?

2 Min Read

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా, నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఈమె నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని నిహారికకు భారీ లాభాలను కూడా తీసుకువచ్చింది.

ఇలా నిహారిక (Niharika Konidela) కెరియర్ పరంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. దీంతో ఈమె వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక తన వదిన సినీనటి లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Niharika
Niharika

లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇక వీరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఘనంగా వీరి వివాహం గత ఏడాది నవంబర్ నెలలో ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరిగిన తర్వాత లావణ్య పెద్దగా సినిమాలలో నటించలేదు. దీంతో ఈమె ఏం చేస్తుంటారు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆత్రుత చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక (Niharika Konidela) సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే లావణ్య గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Niharika And Lavanya

Also Read :

వదిన ఎప్పుడూ కూడా ఇంట్లోనే సమయం గడుపుతుందని తెలిపారు. ఆమె 24 గంటలు ఇంట్లో ఉండమన్నా ఉంటారని, అలా ఇంట్లో ఉంటూనే తన పనులు తాను చేసుకుంటూ ఉంటుందని వెల్లడించారు. నేనైతే ఇంట్లో క్షణం కూడా ఉండలేనని కానీ వదిన ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాదు అంటూ ఈ సందర్భంగా నిహారిక తన వదిన లావణ్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article
Exit mobile version