Niharika Ex Husband : మెగా డాటర్ నిహారిక పెళ్లై ముచ్చటగా మూడేళ్లు కూడా గడవకముందే మన్పర్ధలతో చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. మెగా ఫ్యామిలీలో వరుసగా ఇద్దరు మెగా ఫ్యామిలీ డాటర్లు.. తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. అందులో మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక కూడా చేరింది. చైతన్యతో విడిపోయిన తరువాత నిహారిక వైపు నెటిజన్లు ఎక్కువగా తప్పులు చూపించారు. అయితే.. నిహారిక విషయంలో పెళ్ళికి ముందు ఏటువంటి ఇబ్బందులు కానీ.. ఎలాంటి తప్పులు కాని కనిపించలేదు. ఎప్పుడైతే నిహారిక ఏడు అడుగులు వేసిందో అప్పటి నుంచి ఆమెపై నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ అయ్యాయి.
నిహారిక పెళ్లి తరువాత వెళ్లిన పార్టీలో డ్రగ్స్ దొరకడం, జిమ్ ట్రైనర్ తో పలు వీడియోలు పోస్టు బయటకు రావడతో ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఒక.. ఐపీఎస్ ఇంటికి కోడలిగా వెళ్ళిన నిహారిక ఇలా చేయడంపై ఏంటని రక రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మోగా డాటర్ కూడా తన విడాకుల గురించి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ పెట్టింది.. దీనికి కౌంటర్ ఇస్తూ వచ్చాడు చైతన్య. ఇదంతా మమూలే వీరిద్దరూ మళ్లీ కలుస్తారని అనుకున్నారు నెటిజన్లు. కానీ ఛాన్స్ లేకుండా పోయింది.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో నిహారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు మళ్లీ వచ్చాయి.
Also Read : Ntr -Kalyan Ram: ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య దూరం పెంచిన దేవర.. అసలేం జరుగుతోంది?
Niharika Ex Husband Set to Marry Another Actress?
దానికి నిహారిక నా వయస్సు ఏమీ అయిపోలేదు అంటూ.. మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా అని క్లారిటీ ఇచ్చింది. చైతన్య, నిహారిక విడియోన చాలా కాలం తరువాత చైతన్య ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చైతన్య పెళ్ళి కి రెడీ అవుతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కాకుండా చైతన్య (Niharika Ex Husband) పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా ఎవరో కాదు నిహారికకు ప్రాణ స్నేహితురాలే అని టాక్ వినిపిస్తోంది. చైతన్య పెళ్లి చేసుకునే అమ్మాయి ఓ యంగ్ హీరోయిన్ అని కూటా టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే.. ఈ వార్తను మాత్రం మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. అందులో నిజం లేదని, చైతన్య(Niharika Ex Husband) పెళ్లి చేసుకునే అమ్మాయి నిహారికకు స్నేహితురాలు కాదని.. అసలు చైతన్య పెళ్లికి రెడీ అయిన విషయం ఏమీ లేదంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు మెగా బ్రదర్ నాగ బాబు కూతురు మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. నిహారిక పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.