Pushpa 2 : దేవిశ్రీ ఉండగా ముగ్గురా? అసలేం జరుగుతోంది పుష్ప?

2 Min Read

Pushpa 2 : ఆ మధ్య హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్ మధ్య విభేధాలు వచ్చాయని.. అలిగి విదేశాలకు వెళ్లిపోయారని.. పుష్ప 2 షూటింగ్ ఆగిందంటూ.. రకరకాలుగా ప్రచారం జరిగింది. ఫైనల్‌గా అలాంటిదేమి లేదంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం.. ఆ తర్వాత షూటింగ్ చక చక జరగడం జరిగిపోయింది. ప్రస్తుతం ఐటెం సాంగ్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు సుకుమార్. అల్లు అర్జున్, శ్రీలీల పై ఈ సాంగ్ షూట్ చేస్తున్నాడు.

మరో నాలుగైదు రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి.. గుమ్మడి కాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ పై ఫోకస్ చేయనున్నాడు. అలాగే.. నవంబర్ 15న ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇలాంటి సమయంలో ఒక షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. పుష్ప సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. పుష్ప2కి (Pushpa 2) అంతకుమించి ఆల్బమ్ రెడీ చేస్తున్నాడు.

Also Read : Pushpa 2: పుష్ప 2 ప్రతి సీన్ కు దిమ్మ తిరిగిపోతుంది… అంచనాలను పెంచేస్తున్న DSP?

Pushpa2 music directors

కానీ ఇప్పుడు దేవిశ్రీ కేవలం పాటలు మాత్రమే ఇస్తున్నాడు.. బీజిఎం వేరే వాళ్లు ఇస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. దేవికి బదులుగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. తమన్‌తో పాటు మరో ఇద్దరు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ‘క’ సినిమాకి సాలిడ్ స్కోర్ అందించిన సంగీత దర్శకుడు సామ్ సిఎస్.. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ కూడా పుష్ప 2 నేపథ్య సంగీతం కోసం వర్క్ చేస్తున్నారట.

అయితే.. ఆల్రేడీ దేవి ఉండగా మళ్లీ వీళ్లెందుకు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయలేకపోతున్నాడా? అందుకే తమన్, సామ్ సిఎస్, అజనీష్‌ని రంగంలోకి దింపారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. లేదంటే.. సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share This Article
Exit mobile version