Nayanthara : 50 సెకండ్లకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్.. ఈమె చాలా కాస్ట్లీ గురూ?

2 Min Read

Nayanthara : సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువకాలం ఇండస్ట్రీలో మనుగడ ఉండదనే విషయం తెలిసిందే. అందుకే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను సెలబ్రిటీలు బాగా పాటిస్తుంటారని చెప్పాలి. వారు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని భారీ స్థాయిలో సంపాదిస్తూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో హీరోయిన్లు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో కూడా అత్యధిక అభిమానులను సంపాదించుకొని భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఒక సినిమాలో నటిస్తే నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.

Also Read : Pawan Kalyan: పవన్ వ్యవహారం మెగా ఫ్యామిలీకి నచ్చలేదా… అందుకే మౌనం వహిస్తున్నారా?

Nayanthara remuneration

ఇక ప్రమోషన్ల ద్వారా కూడా కోట్లలో ఆదాయం అందుకుంటారు. ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో నటి నయనతార ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్న ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే వరుస అవకాశాలు రావడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు.

ఇలా ఒక్క సినిమాకు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని సుమారు ఐదు ఆరు నెలల పాటు కష్టపడే నయనతార(Nayanthara) కేవలం ఒక నిమిషం యాడ్ కోసం ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇటీవల నయనతార చేసిన ఓ యాడ్ కోసం కేవలం 50 సెకండ్లకే ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక ఇండస్ట్రీలో కొనసాగుతూ నయనతార వందల కోట్ల ఆస్తులను కూడ పెట్టారని తెలుస్తోంది. ఇక కెరియర్ మొదట్లో ఈమె ప్రేమా బ్రేకప్ అంటూ వార్తలలో నిలిచిన ఇప్పుడు మాత్రం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Share This Article