బావ హలీమ్, బిర్యానీ అద్భుతంగా చేస్తారు… ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ బయటపెట్టిన నితిన్!

2 Min Read

Ntr: నార్నే నితిన్ పరిచయం అవసరం లేని పేరు ఎన్టీఆర్ బావ మరిదిగా, హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన సొంత టాలెంట్ తోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల నితిన్ నటించిన ఆయ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ తన బావ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఎన్టీఆర్ నటన పరంగా డాన్సుల పరంగా ఎలా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. అంతే కాకుండా ఈయన మంచి తనం గురించి కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వెల్లడించారు. ఇలా బయటకు వచ్చినప్పుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలు మనకు తెలుసు కానీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా నితిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ నేను కనుక ఇంట్లో ఉన్నాను అంటే వెంటనే బావ వద్దకు వెళ్ళిపోతానని తెలిపారు. బావ పైకి కనిపించే అంత గంభీరంగా ఉండరు. చాలా సరదా సరదాగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటారు. బావ ఎక్కడుంటే అక్కడ సరదా వాతావరణం నెలకొంటుందని నితిన్ తెలిపారు.

ఇక బావ వంటలు చాలా అద్భుతంగా చేస్తారని నితిన్ ఎన్టీఆర్ కి సంబంధించిన బిగ్ సీక్రెట్ బయటపెట్టారు. ముఖ్యంగా బావ హలీం ,చికెన్ బిర్యాని చాలా అద్భుతంగా వండుతారని వండటమే కాదు ఆయన అంతే అద్భుతంగా వడ్డిస్తారని కూడా నితిన్ తెలిపారు. ఇలా ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ గురించి తన బావమరిది నితిన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ కూడా పలు సందర్భాలలో తనకి ఏదైనా ఫ్రస్టేషన్ వస్తే వెంటనే కిచెన్ లోకి వెళ్లి తనకు నచ్చిన ఫుడ్ చేసుకొని తింటానని పలు సందర్భాలలో తెలిపారు. అదే విధంగా బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో స్వయంగా ఈయన హౌస్ లోకి వెళ్లి మరి బిర్యానీ వండిన సంగతి మనకు తెలిసిందే.

TAGGED:
Share This Article