Nagarjuna: సినీ నటుడు నాగార్జున ప్రస్తుతం ఆయన కుమారుడు నాగచైతన్య వివాహ వేడుకలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నటుడు నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాలవల్ల ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయారు. ఇలా సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు.
ఇలా శోభిత ప్రేమలో ఉన్న ఈయన పెద్దల సమక్షంలో ఇదివరికే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి జరగనున్న నేపథ్యంలో పెళ్లి పనులలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించి ఆహ్వానాలు కూడా అందుతున్నాయని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలలో కుటుంబ సభ్యులు బంధువులు అత్యంత సన్నిహితులు సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు.
Also Read : Nagachaitanya: పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం… నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు!
Nagarjuna Sensational Comments on Naga Chaitanya and Sobhita’s Wedding – “It’s Their Choice!”
ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున (Nagarjuna) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య శోభిత వివాహాన్ని ఘనంగా జరిపించాలని నాగార్జున భావించినప్పటికీ అందుకు శోభిత నాగచైతన్య ఒప్పుకోలేదని తెలిపారు. వాళ్ళిద్దరూ కూడా తమ పెళ్లి సింపుల్గా ఉండాలని కోరుకున్నారు అందుకే ఏర్పాట్లు కూడా చాలా సింపుల్ గా జరుగుతున్నాయని నాగార్జున తెలిపారు.
ఇక ఈ పెళ్లి వేడుకలలో సుమారు 400 కుటుంబాలు పాల్గొనబోతున్నారని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు వారి స్నేహితులు సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈయన తెలిపారు. ఇక నాగచైతన్య శోభిత ఇష్ట ప్రకారమే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. నిజానికి నాగచైతన్యకు ఇది రెండవ వివాహం కావడంతోనే ఆయన తన పెళ్లిని అట్టహాసంగా కాకుండా చాలా సింపుల్ గా చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.
ఇక నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో గోవాలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఒకవైపు హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ అలాగే క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు అందుకే ఇప్పుడు మాత్రం చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.