Nagamanikanta : బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని ఏడువారాలపాటు హౌస్ లో సందడి చేసిన వారిలో కంటెస్టెంట్ నాగమణికంఠ ఒకరు. ఈయన హౌస్ లో తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. తరచూ తన భార్య బిడ్డను కలవడం కోసమే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని ఎలాగైనా తాను హౌస్ లో విన్నర్ గా నిలబడాలి అంటూ కామెంట్లు చేశారు.
ఇలా ఏడువారాల పాటు హౌస్ లో కొనసాగిన మణికంఠ ప్రేక్షకులను సందడి చేస్తూనే పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక 7 వ వారం సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చారు. నాగ మణికంఠ ఎలిమినేట్ అయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సెల్ఫ్ ఎలిమినేట్ కావడానికి గల కారణాలను కూడా తెలిపారు. నిజానికి తాను బిగ్ బాస్ విజేతగా తిరిగి రావాలనే హౌస్ లోకి వెళ్ళాను కానీ నాకు ఆరోగ్యం సహకరించలేదు. ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యం కాదని, అందుకే బయటకు వచ్చానని తెలిపారు.
Also Read : Bigg Boss 8 : వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ ను రివీల్ చేసిన బిగ్ బాస్ ఎవరో తెలుసా?
Nagamanikanta’s Surprise Gift to Gangavva: Find Out What It Is!
ఒకవేళ తాను బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు కొనసాగి విజేతగా నిలిచి ఉంటే ఆ ప్రైజ్ మనీ హెచ్ఐవి బాధితుల కోసమే ఖర్చు చేసేవాడిని. ఓసారి హెచ్ఐవి తో బాధపడుతూ ఓ చిన్నారి చనిపోవడం చూసి చలించిపోయాను అందుకే వారికి ఏదో ఒకటి చేయాలని ఆ క్షణమే అనుకున్నానని తెలిపారు.. ఇక గంగవ్వ గురించి కూడా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మణికంఠ(Nagamanikanta) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గంగవ్వ హౌస్ నుంచి బయటకు రాగానే తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశానని ఈయన తెలిపారు. మరి గంగవ్వకు మణికంఠ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే విషయానికి వస్తే ఆమె కోసం ఈయన అర్ద తులం బంగారు కొనిస్తానని నాగమణికంఠ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నాగ మణికంఠకు గంగవ్వ అంటే ఎంత గౌరవం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ మణికంఠ గంగవ్వకు చెప్పిన విధంగా గిఫ్ట్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.