Nagachaitanya -Sobhita: అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి నాగచైతన్య అనంతరం మరొక హీరోయిన్ శోభిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం మా ఇంట్లో సంతోషాన్ని తిరిగి తెచ్చిందని వారిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈయన నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేశారు. అలాగే చాలా హడావిడిగా నిశ్చితార్థం చేశామని పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం శోభిత నాగచైతన్య ఇద్దరు కూడా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులన్నీ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఏడాది చివరిన లేదా వచ్చేయేడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతుందని సమాచారం. అలాగే నాగచైతన్య మొదటి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, అలాగే మన హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో జరిగింది. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి ఎక్కడ చేయాలి అనే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
వీరి పెళ్లి హైదరాబాదులో కాకుండా రాజస్థాన్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విదేశాలలో కూడా సరైన ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చేయేడాది ఫిబ్రవరిలో అయితే నాగచైతన్య శోభిత కమిట్ అయిన సినిమాలు కూడా పూర్తి అవ్వడంతో వీరికి కూడా కాస్త విరామం దొరుకుతుందని అందుకే వచ్చేయేడాది మొదట్లోనే వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా ఈ సినిమాలో నటించబోతున్నారు. నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నారు.