Nagachaitanya : అక్కినేని నాగచైతన్య త్వరలోనే మరో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఈయన ఏం మాయ చేసావే సినిమా ద్వారా నటి సమంతతో ప్రేమలో పడ్డారు. ఇలా సమంతను ప్రేమించిన ఈయన పెద్దల సమక్షంలో ఇద్దరు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట అనంతరం ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
సమంత నాగచైతన్య(Nagachaitanya) విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరి విడాకులకు కారణాలు ఇదే అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ తమ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. చైతన్య కూడా పలు సినిమాలకు కమిట్ అయ్యారు. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య మరో నటి శోభిత ప్రేమలో పడ్డారు.
Also Read : చైతన్యతో విడాకులు.. Samantha ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు.. ఫోటోలు వైరల్!
Marriage with Shobhita NagaChaitanya who erased the last memory with Samantha?
ఇక వీరిద్దరు కూడా ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. ఇప్పటికే శోభిత ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇలా శోభితతో కలిసి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న నాగచైతన్య సమంతతో ఉన్న జ్ఞాపకాలన్నీ చెరిపేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన సమంతతో కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు.
సమంతతో కలిసి నాగచైతన్య నటించిన మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయి. అలాగే సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో కూడా ఉంది. దీనికి బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్ అని క్యాప్షన్ ఉంది. ఈ ఫోటోని కూడా నాగచైతన్య అలాగే ఉంచారు. శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా ఈ ఫోటో ఉండడంతో ఈ ఫోటోని డిలీట్ చేయాలి అంటూ సమంత అభిమానులు డిమాండ్ చేశారు.
ఇకపోతే శోభితతో మరి కొద్ది రోజులలో ఈయన ఏడడుగులు నడవబోతున్న సమయంలో సమంతతో కలిసి దిగిన చివరి జ్ఞాపకాన్ని కూడా డిలీట్ చేశారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. జాలరి నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకేక్కబోతుంది.