Pawan Kalyan : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపించారు. రాజకీయాల్లోకి రావాలనే కల ఒకటైతే.. ప్రజలకు మంచి చేయాలనే ఆశయం మరో వైపు. అందులో భాగంగానే ఎన్నో అవమానాలు, దూషణలు, విమర్శలు ఎదుర్కొని ఈరోజు తన పార్టీ ద్వారా 100శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. భవిష్యతులో రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి పవన్ కళ్యాణ్ ఆదర్శం అని చెప్పొచ్చు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా వేగంగా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. తన తమ్ముడికి ఇష్టమైన ఆహారం గురించి మాట్లాడాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మరి నాగబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రా స్టైల్లో వండిన పలావ్ బిర్యానీ అంటే పవన్ లొట్టలేసుకుంటూ తింటారని నాగబాబు అన్నారు. రోజూ తినే ఆహారం కంటే పలావు ఉన్న రోజునే ఎక్కువ తింటానని చెప్పారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలపైనే దృష్టి పెట్టాడని, ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) షూటింగ్ లో పాల్గొంటున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి ప్రజల కోసం మళ్లీ రాజకీయాల్లో బిజీ కానుందని సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ విషయానికి వస్తే.. నక్సలైట్ అవ్వాలని భావించిన అతడిని తన వదిన సురేఖ ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. ప్రజలకు ఎల్లవేళలా మేలు చేయాలనే ఆయన కోరిక బలపడి నేడు ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తొలిసినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ హీరో మాత్రమే కాదు గొప్ప డాన్సర్ కూడా. అంతేకాదు అప్పుడప్పుడు తన సినిమాలలోని కొన్ని పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ఇక తనకు దర్శకత్వంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. రెండు సినిమాలకు ఆయన డైరెక్షన్ కూడా చేశారు. అలా అన్నీ కలగలిపి నేడు పాపులర్ రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నారు.