Mokshagna : మోక్షజ్ఞ సిని ఎంట్రీ పై నాగ వంశీ కామెంట్స్… ఎన్టీఆర్ మనవడు అంటూ?

2 Min Read

Mokshagna : నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కుటుంబ కథ చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలలో కూడా నటించి బాలయ్య ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్న సరైన దర్శకుడు, సరైన కథతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నారు. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాలయ్యకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

Also Read : Mokshagna: మోక్షజ్ఞ మొదటి సినిమాకే భారీ బడ్జెట్.. అంత నమ్మకం ఏంటయ్యా?

ఇక ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంచి సక్సెస్ అయ్యారు. ఇక మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.

అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వరుస మీడియా సమావేశంలో పాల్గొంటూ వార్తలలో నిలుస్తున్న నాగ వంశీ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా స్పందించారు.

మోక్షజ్ఞను తాను కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కలిశానని తెలిపారు. అయితే తాను సినిమాలపరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని నాగ వంశీ వెల్లడించారు. మోక్షజ్ఞ తన ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటారని ఎందుకంటే మోక్షజ్ఞ ఎన్టీఆర్ మనవడు బాలయ్య కొడుకు అని చెప్పుకు వచ్చారు. ఇక ప్రశాంత్ వర్మ చాలా టాలెంట్ ఉన్న దర్శకుడని ఈ సినిమాని ఎలా మలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు అంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share This Article