Naga Chaitanya – అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జోష్ సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నాగ చైతన్య ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాల్లో నటిస్తూనే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత, శోభితా ధూళిపాళతో నాగ చైతన్య తన రిలేషన్ షిప్ కొనసాగించాడు. కొన్నాళ్లుగా తమ బంధాన్ని గోప్యంగా ఉంచిన నాగ చైతన్య.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవల నిశ్చితార్థాన్ని ప్రైవేట్‌గా జరుపుకున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాగార్జున బాటలో ఆయన తనయుడు నాగ చైతన్య నడుస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూనే వ్యాపార రంగాల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాలు చూసుకోవడమే కాకుండా సొంతంగా వ్యాపారం కూడా పెట్టుకున్నాడు.
2022లో హైదరాబాద్ మాదాపూర్‌లో షోయు పేరుతో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించిన నాగ చైతన్య మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఇది రుచినిచ్చే సౌత్-ఈస్ట్-ఆసియా వంటకాలకు ప్రసిద్ధి చెందింది. భోజన ప్రియులకు రకరకాల వంటకాలు వడ్డిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. షోయు రెస్టారెంట్ తక్కువ కాలంలోనే హైదరాబాద్‌లోని టాప్-10 రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కంటే చైతన్య దీని ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడు.
ఈ షోయూ కిచెన్ ద్వారా ప్రతిరోజూ రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. వారాంతపు సెలవులు వస్తే దాని ఆదాయం రెట్టింపు అవుతుంది. షోయు ద్వారా ఏడాదికి నాగ చైతన్య రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత అతని ఆదాయం మరింత పెరిగిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. శోభిత రాకతో నాగ చైతన్యకు బాగా కలిసొచ్చిందని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు.