Mrunal Thakur : సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. వారి సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు అలాగే వారు ఏదైనా వెకేషన్ లకి వెళ్లిన వెంటనే వారికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా కూడా సెలబ్రిటీలు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న వారిలో నటి మృణాల్ (Mrunal Thakur) కూడా ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో పలు బుల్లితెర సీరియల్స్ లో నటించారు. అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.
Also Read : Nayanthara : 50 సెకండ్లకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్.. ఈమె చాలా కాస్ట్లీ గురూ?
Mrunal Thakur: Star Heroine Gives Birth Without Marriage – Fans in Shock?
ఈ విధంగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమెకు తెలుగులో సీతారామం సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా మృణాల్ చిన్నారితో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉయ్యాలలో పడుకున్న పాప తన పాదాలతో ఎదలపై తన్నుతుంటే హీరోయిన్ మృణాల్ ఆనందంతో తెగ మురిసిపోయింది. అంతేకాదు ఆ ఆనంద క్షణాలకు తానెంతో పరవశించిపోయానంటూ ‘the shot that made you cry’అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఇలా ఈ ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి లేదు …ప్రెగ్నెన్సీ లేదు అసలు పాప ఎలా వచ్చింది, పెళ్లి కాకుండానే తల్లి అయ్యారా అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.