Mrunal Thakur : ఆగలేకపోతున్న అంటూ.. లవర్ ను పరిచయం చేసిన మృణాల్

2 Min Read

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసింది. తెలుగులోకి అడుగు పెట్టకముందే పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తన గ్లామర్ షోతో పాటు తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రేజ్ తోనే ఆమెకు తెలుగులో నటించే అవకాశం దక్కించుకుంది. అలా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తొలి డైరెక్ట్ సినిమాతో ‘సీతారామం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ తొలి సినిమాతోనే వారి మనసు దోచుకుంది. సీత పాత్రలో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Also Read : Billionaire watch సల్మాన్ వాచ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

ఈ సినిమాతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయంటే అతిశయోక్తి కాదు. వరుస ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. ఈ సినిమా తర్వాత మృణాల్‌కి నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమాలో నటించినా అది డిజాస్టర్ అయ్యింది.

ఫ్లాప్‌ల నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. అయితే, ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఆమె గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే అమేజింగ్ పర్సన్.. రేపు చెన్నైలో కలుద్దాం.

నీ బర్త్ డే జరపడానికి నేను ఆగలేకపోతున్నాను” అని ఆమె రాసింది. ఆమె ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మృణాల్(Mrunal Thakur), ఆ అనౌన్ పర్సన్ మధ్య సంబంధం ఏంటో మాత్రం క్లారిటీ లేదు. కానీ వారి ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. మంచి రీఎంట్రీ కోసం చూస్తోంది. మరి తదుపరి సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Share This Article