మోక్షజ్ఞ సినిమాకు ఆదిలోనే ఆటంకం…ఏం జరిగిందంటే?

2 Min Read

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ రంగం సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈయన ఎంట్రీ చాలా ఆలస్యమైంది అయితే ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసింది ఊహించని లుక్ లో మోక్షజ్ఞ కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా మోక్షజ్ఞ (Mokshagna) పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియగానే సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

Also Read : మోక్షజ్ఞ మొదటి సినిమాకే భారీ బడ్జెట్.. అంత నమ్మకం ఏంటయ్యా?

Mokshagna moive updates

ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఈ సినిమాకు ఓ పెద్ద సమస్య వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ సరసన హీరోయిన్ ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి. ఇదే విషయంపై ప్రశాంత్ వర్మ సైతం ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో నార్త్ హీరోయిన్ అయితే బాగుంటుందని పలువురు సూచనలు చేశారట అంతే కాకుండా ఇదివరకే పలు సినిమాలలో నటించిన హీరోయిన్ అయితే సినిమా మార్కెటింగ్ పరంగా కూడా ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియడం లేదు.

ఇకపోతే మోక్షజ్ఞ ఈ సినిమాలో చాలా చిన్న కుర్రాడిగా అనిపిస్తున్నాడు. కనుక హీరోయిన్‌ ను మోక్షూకి తగ్గట్లుగా ఎంపిక చేయడం అనేది పెద్ద టాస్క్ గా మారింది. ఇలా ఈ సినిమా షూటింగ్ కు మొదట్లోనే హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి కథకు అనుగుణంగా ఈయన ఎలాంటి నటీనటులను ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది.

Share This Article
Exit mobile version