Pm-Aasha Scheme: రైతులకు గుడ్ న్యూస్.. రూ.35వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ

2 Min Read

Pm-Aasha Scheme: రైతులకు గుడ్ న్యూస్.. రూ.35వేల కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం PM-AASHA కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘‘ మన రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్‌కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపామన్నారు.

ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయంతో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు కనీస ధర లభించనుంది. ఇలాంటి పంటల సాగులో భారతదేశం స్వావలంబన సాధిస్తుంది. రైతులు సంతోషంగా ఉంటారు. వారి ఆదాయం పెరుగుతుంది.

PM-ASHA అంటే ఏమిటి?
ఇది PM-ASHA అనేది సమీకృత పథకం. రైతులు, వినియోగదారుల సేవలను సులభతరం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం ధర మద్దతు పథకం (PSS) , ధరల స్థిరీకరణ నిధి (PSF) పథకాలను పీఎం ఆశాలో విలీనం చేసింది. దీంతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా వినియోగదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

కేబినెట్ ఇతర నిర్ణయాలు
దీనితో పాటు మీడియా, వినోద ప్రపంచం కోసం ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. కంటెంట్ క్రియేటర్ల వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ‘బయో రైడ్’ పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది బయోటెక్నాలజీలో భారతదేశం పురోగతిని మరింత పెంచుతుంది. ఇది స్థిరమైన అభివృద్ధి, ఫైనాన్సింగ్, కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టి పెడుతుంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఆమోదం
దేశంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఈరోజు కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జీని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని అన్నారు. ఈ నిర్ణయం మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యమయ్యేలా చేయడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు.

Share This Article