Mega Vs Allu : ఇండస్ట్రీలో మెగా వర్సెస్ అల్లు అనే విధంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతూ ఉన్నాయని వార్తలు వచ్చాయి కానీ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వివాదం కాస్త బయటపడింది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా ఏకంగా వైకాపా నాయకుడికి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్లారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదాలు బయటపడ్డాయి.
ఇలా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ (Mega Vs Allu)కి కాకుండా తన ప్రత్యర్థి పార్టీ నాయకులకు మద్దతు తెలపడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పరోక్షంగా అల్లు అర్జున్ గురించి విమర్శలు చేశారు. మరి కొంతమంది మెగా హీరోలు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. ఇక డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు కౌంటర్ గా అల్లు అర్జున్(Mega Vs Allu) నా మనసుకు నచ్చితేనే,నాకు వెళ్ళాలనిపిస్తేనే ఎక్కడికైనా వెళ్తాను అంటూ కామెంట్లు చేశారు.
Also Read :Ramcharan: రామ్ చరణ్ తో పాటు రైమ్ కి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషంలో అభిమానులు!
Is the Mega vs Allu Controversy Resurfacing? New Disputes Emerge
ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది అయితే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 6 తేదీ రాబోతున్న నేపథ్యంలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాని కూడా డిసెంబర్ 20వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించారు కానీ అలా చేయటం వల్ల చరణ్ సినిమాకు దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో వచ్చేయడాది జనవరి 10కి వాయిదా వేశారు.
ఇకపోతే తాజాగా చరణ్ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ బ్యానర్లో రాబోతున్న తండేల్ సినిమాని కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. జనవరి 10న రాంచరణ్ సినిమా విడుదల కాగా అల్లు అరవింద్ నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా అల్లుడికి పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్న మాట వాస్తవమేనని అందుకే తన అల్లుడికి పోటీగా అల్లు అరవింద్ తన సినిమాని విడుదల చేస్తున్నారంటూ కామెంట్లు వినబడుతున్నాయి.
ఇక ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన వెల్లడించకపోయిన ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రాబోతోంది ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు.