Maruti Suzuki Baleno : మారుతి సుజుకి పండుగ సీజన్‌లో సందడి చేయడానికి పూర్తి సన్నాహాలు చేసింది. మారుతి భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి ఈ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి బాలెనోకి(Maruti Suzuki Baleno), ఈ స్పెషల్ ఎడిషన్‌కి తేడా ఏంటన్న ప్రశ్న కస్టమర్లలో నెలకొని ఉంది. ఈ వాహనం ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ రెండింటిలోనూ కంపెనీ కొన్ని మార్పులు చేసింది. బాలెనో రీగల్ ఎడిషన్ మోడల్ ధర ఎంత, ఫీచర్లు ఏంటో చూద్దాం.మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌లో తేడా ఏమిటి?
Also read : పండుగల సీజన్లో మార్కెట్లోకి నాలుగు కొత్త కార్లు.. వాటి ఫీచర్స్ ఇవే
Maruti Suzuki Baleno Regal Edition Launched with 6 Airbags
ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే.. రీగల్ ఎడిషన్‌లో ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, గ్రిల్ అప్పర్ గార్నిష్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, బాడీ-సైడ్ మోల్డింగ్, బ్యాక్ డోర్ గార్నిష్ , డోర్ వైజర్ వంటి యాక్సెసరీలు లభిస్తాయి. బాలెనో ఈ స్పెషల్ ఎడిషన్ క్యాబిన్‌లో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, కొత్త సీట్ కవర్లు, ఆల్-వెదర్ 3డి ఫ్లోర్ మ్యాట్‌లు, విండో కర్టెన్లు లభిస్తాయి. ఈ వాహనం రీగల్ ఎడిషన్ మోడల్‌ను మాన్యువల్, ఆటోమేటిక్, పెట్రోల్, సీఎన్జీ వేరియంట్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ ధర
మారుతి సుజుకి బాలెనో ధర రూ. 6 లక్షల 60 వేల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 9 లక్షల 80 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఎక్స్ ట్రా యాక్ససరీస్ కావాలంటే విడిగా కొనుగోలు చేయవచ్చు.. అంటే విడిగా వీటి ధర రూ. 45 వేల నుండి రూ. 60 వేల వరకు ఉంటుంది. ఆల్ఫా వేరియంట్‌తో కూడిన రీగల్ ఎడిషన్‌కు రూ. 45 వేల 820, జీటా వేరియంట్‌తో రీగల్ ఎడిషన్‌కు రూ. 50 వేల 428, డెల్టా వేరియంట్‌తో రీగల్ ఎడిషన్‌కు రూ. 49 వేల 990, సిగ్మా వేరియంట్‌తో రీగల్ ఎడిషన్‌కు రూ. 60 వేల 199 అదనంగా చెల్లించాలి. ఖర్చు అవుతుంది.
బాలెనో మొదటిసారి ఎప్పుడు లాంచ్ చేయబడింది?
మారుతీ సుజుకీ 2015లో తొలిసారిగా భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం బాలెనోను విడుదల చేసింది. 2015 నుండి మారుతి కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. నివేదికలను విశ్వసిస్తే, నెక్సా విక్రయాల్లో బాలెనోకు 55 శాతం వాటా ఉంది. బాలెనోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్ పీ, వెనుక పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.